ఫిబ్రవరి 1 నుంచి కొత్త పెన్షన్లు – ఇంటివద్దకే పెన్షన్లు

స్పందనలో సీఎం*
*ఫిబ్రవరి 1 నుంచి కొత్త పెన్షన్లు – ఇంటివద్దకే పెన్షన్లు *
*ఫిబ్రవరి 15 నుంచి కొత్త పెన్షన్, బియ్యం కార్డులు పంపిణీ*
*ఉగాదినాటికి 25 లక్షల ఇళ్లపట్టాలు మంజూరు* 
*ఇంట్లో మహిళల పేర్లమీద పట్టాలు*
*నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు.. మీ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.... చేయెత్తే పరిస్థితి రాకూడదు*
*ఇచ్చే ఇళ్ల పట్టాలు నివాస యోగ్య స్థలాల్లో ఉండాలి*
*మెజార్టీ లబ్ధిదారుల అంగీకారం తీసుకోండి*
*అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసం ఉన్నవారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి*
*ఇళ్లు కట్టించి ఇచ్చిన తర్వాతే వారిని తరలించండి*
*ఫిబ్రవరి 28న జగనన్న విద్యా వసతి దీవెన ప్రారంభం*
*ఇప్పుడు మొదటి విడత, జులై– ఆగస్టులో రెండో విడత*
*11 లక్షలమందికిపైగా విద్యార్థులకు లబ్ధి*
*ఫిబ్రవరి 28న 3,300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం*
*ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు*
*గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్టు ఇది
పశువులకు కూడా హెల్త్‌ కార్డులు*
*గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు*
*336 సేవలు కేవలం 72 గంటల్లో పూర్తిచేయాలని నిర్దేశించుకున్నాం*
*541 సేవలు ఎన్నిరోజుల్లో అందుతాయో అన్న జాబితా గ్రామ సచివాలయాల్లో డిస్‌ ప్లే చేయాలి*
*గ్రామ, వార్డు సచివాలయాల్లో నిరంతరాయంగా లబ్దిదారుల జాబితా, పథకాల సమాచారం*
*కంటివెలుగులో భాగంగా ఫిబ్రవరి 1నుంచి మూడో విడత కార్యక్రమం*
*అవ్వాతాతలపై ప్రత్యేక దృష్టి*
*ఫిబ్రవరిలో 4,906 కొత్త ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణానికి పనులు ప్రారంభం*
*అమ్మ ఒడిలో 1,07,290 ఖాతాల టాన్సాక్షన్స్‌ ఫెయిల్‌ అయినట్టుగా గుర్తించిన అధికారులు*
*వెంటనే డబ్బు అందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశం*
*మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని సీఎం ఆదేశాలు*
*కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి*
*మరిన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ*
*జనవరి 30న అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్‌ డెలివరీ*
*ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్‌ డెలివరీ*
*ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూల్లో ఇసుక డోర్‌ డెలివరీ*
*వర్షాకాలం వచ్చే సరికి 60–70 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచాలన్న సీఎం*
*దిశ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై సీఎం ఆరా*
*ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరం దిశ పోలీస్‌ స్టేషన్లు సిద్ధమవుతున్నాయన్న అధికారులు*
*13 జిల్లాల్లో 13 కోర్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కలెక్టర్లు కృషిచేయాలి*:



అమరావతి: సచివాలయంలో స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష
హాజరైన వ్యవసాయశాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు, సీఎస్‌ శ్రీమతి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌


స్పందన కింద వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 60శాతం వరకూ బియ్యం కార్డులు, పెన్షన్లు, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయి: సీఎం
స్పందనకు సంబంధించి అధికారులు బాగా పనిచేశారు:
చాలామంది ప్రశంసించారు కూడా:
ఇక పై దరఖాస్తులకు సంబంధించి మనం కార్డులు జారీచేయాల్సి ఉంది:
 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మొత్తంగా 54.64 లక్షలకు పైగా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాం:
ఎన్నికలకు 6 నెలల ముందు పెన్షన్లు 39 లక్షలు ఉండేవి:
ఇప్పుడు 54లక్షలకు పైబడి ఇస్తున్నాం:
పెన్షన్లు ఫిబ్రవరి 1 నుంచి డోర్‌డెలివరీ చేస్తున్నాం:
గ్రామ సచివాలయాల్లో పెన్షన్లు, బియ్యం కార్డులకు సంబంధించి అర్హుల జాబితాలను డిస్‌ప్లే చేశారా? లేదా? అని కలెక్టర్లతో ఆరా తీసిన సీఎం


ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ కొత్త పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులు పంపిణీ: సీఎం
ఆ సమయానికి కార్డులన్నింటినీ ప్రింట్‌ చేసి పంపిణీకి సిద్ధంచేయాలి: సీఎం
సోషల్‌ఆడిట్‌ కోసం పెన్షన్‌కార్డులు, బియ్యంకార్డులకు దరఖాస్తు చేసుకువారు:
సోషల్‌ ఆడిట్‌ పూర్తిచేసి ఫిబ్రవరి 2 కల్లా పంపించాలి:
ఆతర్వాత ఫిబ్రవరి 15 కల్లా కొత్త కార్డులను పంపిణీచేస్తారు.
ఇది పూరై్తన తర్వాత అర్హులు ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్నా... వారికి కొత్తకార్డులు గ్రామ సచివాలయాల ద్వారా రొటీన్‌గా మంజూరు జరుగుతుంది:
541 సేవల్లో భాగంగా ఈ కార్డులను అందిస్తారు :
నిర్దేశించుకున్న సమయంలోగా ఆ కార్డులను వారికి అందిస్తారు:
బియ్యంకార్డుకోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే... 5 రోజుల్లోగా వారికి గ్రామసచివాలయాల్లో కార్డును మంజూరుచేస్తారు:
కొత్తవాళ్లకి కూడా ఫిబ్రవరి 1 నుంచి పెన్షన్లు మంజూరు:


ఇళ్లపట్టాలు:


ఉగాదినాటికి ఇళ్లపట్టాలు మంజూరు : సీఎం
25 లక్షలమందికి మహిళల పేర్లమీద 10 రూపాయల స్టాంపు పేపర్లమీద ఇళ్లపట్టాలు:
అర్హుల జాబితాలను సోషల్‌ఆడిట్‌ కోసం డిస్‌ప్లే చేశారా లేదా? అని ఆరాతీసిన సీఎం
మిస్‌ అయినవారు ఎవరికి దరఖాస్తు చేయాలన్నదానిపై వివరాలు కూడా గ్రామ సచివాయాల్లో డిస్‌ ప్లే చేశామన్న అధికారులు
లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల  స్థలాల కేటాయింపు : సీఎం
ఫిబ్రవరి 15 లోగా ఇళ్లపట్టాల అర్హుల జాబితా సిద్ధం కావాలి
ప్రజాసాధికార సర్వేకూ.. ఇళ్లపట్టాల మంజూరుకు  లింకు పెట్టకూడదు: సీఎం
ఎవరికైనా ఇళ్లు ఇచ్చి ఉంటే.. 2006 నుంచి ప్రభుత్వం వద్ద డేటా ఉంది: సీఎం
కేవలం ఆ డేటాతో మాత్రమే చెక్‌ చేసుకోవాలి:
నేను గ్రామాల్లో పర్యటించేటప్పుడు.. మీ ఊరిలో ఇంటి స్థలం లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.. ఎవరు చెయ్యెత్తకూడదు : సీఎం
ఎవరివల్లకూడా అన్యాయం జరిగిందన్న మాట రాకూడదు : సీఎం


ఇళ్లపట్టాలు ఇవ్వదలచుకున్న స్థలాలను ఖరారు చేసేముందు లబ్ధిదారుల్లో మెజార్టీ ప్రజలు దీనికి అంగీకారం తెలపాలి:
మొక్కుబడిగా ఇచ్చామంటే.. ఇచ్చినట్టుగా ఉంటే.. ఎవ్వరూ కూడా ఆ స్థలాల్లో ఉండటానికి ఇష్టపడరు:
మనం ఇచ్చే ఇళ్లస్థలం వారి ముఖంలో సంతోషాన్ని నింపాలి:
మన ఉద్దేశం నెరవేరాలి:
ఆ స్థలాలు నివాసయోగ్యంగా ఉండాలి, లబ్ధిదారుడు సంతోషంగా ఉంటామనే సుముఖత వ్యక్తంచేయాలి:
అలా కాకపోతే డబ్బు వృథా, లబ్ధిదారులకు అసంతృప్తే మిగులుతుంది:
ప్లాటింగ్‌ చేసేటప్పుడు.... ఈ అంశాలను కచ్చితంగా కలెక్టర్లు పరిశీలించాలి:
ఊరుకు చాలా దూరంలోనూ, నివాసానాకి ఉపయోగంలేని ప్రాంతాల్లో ఇవ్వడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు:
ఫిబ్రవరి 15 కల్లా జాబితా సిద్ధం కావాలి:
ఫిబ్రవరి 21 కల్లా లబ్ధిదారుల వివరాలను కలెక్టర్లు పంపించాలి:
ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్ల అభివృద్ధి ఫిబ్రవరి 25 కల్లా జరగాలి:
మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాలకోసం భూముల సేకరణ పూర్తికావాలి:
మార్చి 10 కల్లా ఇలా సేకరించిన స్థలాల్లో ప్లాట్లను డెవలప్‌ చేయాలి:
మార్చి 15 కల్లా లాటరీలు కూడా పూర్తిచేసి ప్లాట్ల కేటాయింపు జరగాలి:


అభ్యంతరకర ప్రాంతాల్లో నివాసముంటున్నవారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించండి:
వారికి  ప్లాట్ల్లను ఎక్కడ కేటాయిస్తున్న విషయాన్ని వారందరికీ చూపించాలి: సీఎం
ఆ ప్లాట్ల పట్ల వారి అంగీకారాన్నికూడా తీసుకోవాలి:
వచ్చే ఏడాది నుంచి మనం చేపట్టబోయే నిర్మాణాల్లో మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో వీరికి ప్రాధాన్యత ఇవ్వాలి:
ఈ మాటకూడా వారికి చెప్పాలి:
ఆ ఇళ్ల నిర్మాణం పూరై్తన తర్వాత మాత్రమే.. అభ్యంతరకర ప్రాంతాల్లో ఉన్నవారిని తరలించాలి:
అభ్యంతరాల్లేని ప్రాంతాల్లో ఎలాగూ రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పాం:
ఈ క్రైటీరియాను కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో డిస్‌ప్లే చేయాలి:
మనం పారదర్శకంగా పోతున్నాం :
ఎక్కడా దాపరికంలేదు, పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నాం:
మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వారికి మంచి జరగాలి:
ఇది చాలా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం: సీఎం
భవిష్యత్‌ తరాలన్నీ ఈ ప్రభుత్వాన్నీ, అధికారులనూ గుర్తుపెట్టుకుంటాయి:


విద్యా వసతి దీవెన:


ఫిబ్రవరి 28న విద్యా వసతి దీవెన ప్రారంభం:
ఇప్పుడు  మొదటి విడత కింద, జులై– ఆగస్టులో రెండో విడత:
బోర్డింగు, లాడ్జింగు ఖర్చలుకు ఈ డబ్బు తల్లులకు ఇస్తున్నాం:
దాదాపు 11 లక్షల మందికిపైగా పిల్లలకు ఇది ఇస్తున్నాం:
జగనన్న విద్యా  వసతి కింద ఐటిఐæ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇతర కోర్సులకు ఏడాదికి రూ.20వేలు:



*రైతు భరోసా కేంద్రాలు:*


రైతు భరోసా కేంద్రాల ద్వారా మనదైనముద్ర వేస్తున్నాం: సీఎం
గ్రామ సచివాలయాల దగ్గరకే రైతు భరోసా కేంద్రాలు: సీఎం
ఏప్రిల్‌ నెలాఖరు నాటికి 11వేలకుపైగా రైతు భరోసా కేంద్రాలు: సీఎం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రాజెక్టు ఇది: సీఎం
నాణ్యమైన పురుగు మందులు, విత్తనాలు, ఎరువులను గ్రామస్థాయిలో రైతులకు అందిస్తాం:
రైతు పంటవేసే సమయానికి కనీస గిట్టుబాటు ధరలు ప్రకటిస్తాం:
దీనిపై ప్రకటనలు కూడా ఇస్తాం:
కనీస గిట్టుబాటు ధరకన్నా తక్కువ స్థాయికి వెళ్తే.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకుంటుంది:
దీనివల్ల మార్కెట్లో పోటీని కూడా పెంచుతాం:
రాబోయే రోజుల్లో రైతు భరోసా కేంద్రాలద్వారానే విత్తనాల సరఫరా:
ఉత్యమ సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తాం:
మంచి పద్ధతులకు వారికి అవగాహన ఇస్తాం:
రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయరంగంలో సమూల మార్పులను తీసుకు వస్తాం:
పశువులకు కూడా హెల్త్‌ కార్డులు ఇస్తున్నాం:
సచివాలయంలో పశువైద్యానికి సంబంధించిన ఉద్యోగులను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచుతాం:
పశువుల వైద్యానికి అవసరమయ్యే మందులను కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతాం:
గ్రీన్‌ రివల్యూషన్, వైట్‌ రివల్యూషన్, బ్లూ రివల్యూషన్‌కు ఇవి ఎంతో కీలకం:
ఫిబ్రవరి 28న 3,300 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం:
మార్చిలో మరో 5వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం:
ఏప్రిల్‌ మొదటి వారం నాటికి మరో 7 వేల కేంద్రాలు:
మొత్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏప్రిల్‌ నెలాఖరు కల్లా ప్రారంభం:
వీటిని భవనాలను కల్పించాల్సిన బాధ్యత కలెక్టర్లదే:
మండలస్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి:


రైతు భరోసా లబ్ధిదారుల జాబితాను పర్మినెంట్‌గా గ్రామ సచివాలయాల్లో ఉంచాలి:
ఈ సంవత్సరంలో కూడా ఎవరూ మిస్‌ కాకూడదు:
మిస్‌ అయ్యాం అనుకున్నవారు ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునేలా ఉండాలి:
మిగిలిన అన్ని పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను కూడా గ్రామ సచివాలయాల్లో ఉంచాలి:
ఎప్పటికప్పుడు అర్హుల జాబితాను అప్‌డేట్‌ చేసుకోవాలి:
లబ్ధిదారులనుంచి తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలి:


*గ్రామ, వార్డు సచివాలయాలు:*


గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 సేవలు అందిస్తున్నాం:సీఎం
336 సేవలు కేవలం 72 గంటల్లో పూర్తిచేయాలని నిర్దేశించుకున్నాం
మిగిలిన సేవలు ఎప్పటిలోగా అందుతాయో కూడా సమయాన్ని నిర్దేశించుకున్నాం
ఈ 541 సేవలు ఎన్నిరోజుల్లో అందుతాయో అన్న జాబితా గ్రామ సచివాలయాల్లో డిస్‌ ప్లే చేయాలి
వీటితోపాటు వివిధ పథకాల లబ్దిదారుల జాబితా, అర్హతలు డిస్‌ ప్లే కావాలి
పెద్ద పోస్టర్లు అతికించాలి, పర్మినెంట్‌గా ఉండాలి:
గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులే కాకుండా వాలంటీర్లు కూడా చురుగ్గా విధులు నిర్వర్తించేలా ఒక మెకానిజాన్ని పెట్టాలని సీఎం ఆదేశం
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన నిర్వహించాలి: సీఎం
ప్రతి దరఖాస్తుకు గ్రామ సచివాలయంలో రశీదులు ఇస్తారు, ఆ రశీదుకు వెంటనే రెస్పాండ్‌కావాల్సి ఉంటుంది:
కలెక్టర్లు నేరుగా గ్రామ సచివాలయాల కార్యకలాపాలను పర్యవేక్షించాలి:
దరఖాస్తుల స్వీకరణ, రశీదులు, ఆ దరఖాస్తులను పరిష్కరించడం ఈవ్యవహారం అంతా డాష్‌ బోర్డులో కనిపించాలి:
అధికారులు తక్కువైతే.. చెప్పండి, ఆమేరకు ఏర్పాట్లు చేసుకుందాం:
మనం చేస్తున్న కార్యక్రమాలమీద ఫోకస్‌ లేకపోతే... వ్యవస్థలో మార్పలు తీసుకురాలేం:
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల పర్యవేక్షణకు జిల్లాల్లో ఒక జేసీకి అప్పగించాలి: సీఎం


*వైయస్సార్‌ కంటి వెలుగు:*


కంటివెలుగులో భాగంగా మూడో విడత కార్యక్రమం
అవ్వాతాతలపై ప్రత్యేక దృష్టి
గ్రామ స్థాయిలో స్క్రీనింగ్‌ 
ఫిబ్రవరి 1 నుంచి వైయస్సార్‌ కంటి వెలుగు మూడో విడత
దాదాపు 1.25 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేయాలని నిర్ణయం
జులై 31 దాకా మూడో విడత కార్యక్రమం
ఫిబ్రవరి 15 నుంచి ఆరోగ్యకార్డులు జారీ
ఇప్పటివరకూ 66,15,467 మంది పిల్లలకు కంటి పరీక్షలు
లక్షన్నర మందికి కంటి అద్దాలు పంపిణీ కొనసాగుతోంది: సీఎం
46వేల మందికి  శస్త్రచికిత్సలు కూడా చేశారు: సీఎం
ఫోకస్‌ పెడితే ఎంతమందికి మంచి జరుగుతుందో చూస్తున్నాం: సీఎం
మనం ఫోకస్‌ పెట్టకపోతే... ఆ పిల్లల పరిస్థితి అలాగే ఉండేది: సీఎం
అవ్వా, తాతల మీద కూడా మనం ఇలాంటి దృష్టే పెడుతున్నాం: సీఎం
ఫిబ్రవరిలో 4,906 కొత్త సబ్‌సెంటర్ల నిర్మాణానికి పనులు ప్రారంభం: సీఎం


*అమ్మఒడి*


అమ్మ ఒడి కింద 42,33,098 మంది గుర్తింపు
అమ్మ ఒడి కింద 41,25,808 మందికి 6,188 కోట్లు పంపిణీ
1,07,290 ఖాతాల ట్రాన్సాక్షన్స్‌ ఫెయిల్‌ అయినట్టుగా గుర్తించిన అధికారులు
మిగిలిన వారి బ్యాంకు ఖాతాలు ఎందుకు విఫలం అయ్యాయో పరిశీలించండి: సీఎం
వివరాల నమోదులో తప్పులు కారణంగా ట్రానాక్షన్స్‌ ఫెయిల్‌ అయ్యాయని, ఈ వారంలో దీన్ని సరిదిద్దుతామని చెప్పిన అధికారులు


*మధ్యాహ్న భోజనం:*


మధ్యాహ్న భోజనం నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు: సీఎం
కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి పరిశీలన చేయాలి: సీఎం
సెర్ప్‌లో ఆర్డీఓ స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించాలి: సీఎం
రెండు వారాల్లో ఒక యాప్‌కూడా అందుబాటులోకి తెస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు 
భోజనం క్వాలిటీని నిరంతరం పర్యవేక్షించడానికే ఈ మొబైల్‌యాప్‌ అని స్పష్టీకరణ
స్కూళ్లలో బాత్‌రూమ్స్‌ నిర్వహణపైన కూడా దృష్టిపెట్టాలి: సీఎం
అంగన్‌వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై దృష్టి సారించాలి: సీఎం


*ఇసుక డోర్‌ డెలివరీ *:


జనవరి 10 నుంచి తూ.గో, ప.గో, కడప జిల్లాల్లో ఇసుక డోర్‌డెలివరీ ప్రారంభం
ఇప్పటివరకు 1,12,082 టన్నులు డోర్‌ డెలివరీ 
48 –72 గంటల్లో ఇసుక డోర్‌ డెలివరీ
జనవరి 30న అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇసుక డోర్‌ డెలివరీ
ఫిబ్రవరి 7 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో డోర్‌ డెలివరీ
ఫిబ్రవరి 14 నుంచి గుంటూరు, చిత్తూరు, కర్నూల్లో ఇసుక డోర్‌ డెలివరీ
ఇసుకను అధిక రేట్లకు అమ్ముకునే అవకాశం గాని, వినియోగదారులకు అధిక రేట్ల బెడద కాని లేదని చెప్పిన అధికారులు
16.5 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉందని వెల్లడించిన అధికారులు
వర్షాకాలం వచ్చే సరికి 60–70 లక్షల టన్నుల నిల్వ ఉంచాలన్న సీఎం
389 చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు పెట్టామని చెప్పిన అధికారులు
ఫిబ్రవరి 4 నాటికి అన్ని చెక్‌ పోస్టుల నుంచి ప్రత్యక్షంగా చూసే అవకాశం


*దిశ చట్టంపైన కూడా సీఎం సమీక్ష*


దిశ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుపై సీఎం ఆరా
ఫిబ్రవరి మొదటి వారానికి రాజమండ్రి, విజయనగరం దిశ పోలీస్‌ స్టేషన్లు సిద్ధమవుతున్నాయన్న అధికారులు
మిగిలిన పోలీస్‌స్టేషన్లు కూడా ఫిబ్రవరి రెండోవారాంతానికి సిద్ధమవుతాయన్న  డీజీపీ
పోలీసు విభాగం కోరిన మీద అన్నిరకాలుగా ప్రభుత్వం సమకూరుస్తోంది: సీఎం
దేశం మొత్తం మాట్లాడుకునేలా చట్టాన్ని అమలు చేయాలి:
13 జిల్లాల్లో 13 కోర్టుల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కలెక్టర్లు కృషిచేయాలి:
వచ్చే మూడు నెలల్లో ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ ఏర్పాటవుతాయని సీఎంకు తెలిపిన అధికారులు
దిశ పోలీస్‌ స్టేషన్లు, ఫోరెన్సిక్‌ ల్యాబ్స్, జిల్లాకో కోర్టు, ఆస్పత్రుల్లో ఒన్‌స్టాప్‌ సెంటర్లు.. ఇవన్నీ కూడా వెంటనే ఏర్పాటు కావాలి: సీఎం
వీటిని పూర్తిస్థాయిలో ఏర్పాటచేసి, వాటి కార్యకలాపాలు ప్రారంభం కావాలి:
ఏదైనా జరిగితే...ఎస్పీ ఆ కుటుంబానికి పరామర్శించి బాధితురాలికి అండగా ఉంటామని చెప్పాలి: సీఎం
దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చాం:
అమలు కూడా అదే రీతిలో ఉండాలి:


*ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌:*


ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల్లో మధ్యవర్తుల ప్రమేయాన్ని పూర్తిగా కట్‌చేస్తున్నాం: సీఎం
లంచగొండితనం లేకుండా, జీతం పూర్తిగా ఉద్యోగికి నేరుగా వచ్చేలా, వారి జీతాల్లో కోత లేకుండా, అవినీతి లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మేలు చేస్తున్నాం: సీఎం
ఔట్‌ సోర్సింగ్‌  ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు యాభైశాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం